IPL 2022: రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మలింగ

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున సత్తా చాటిన శ్రీలంక మాజీ స్టార్‌ పేసర్‌ లసిత్‌ మలింగ లీగ్‌లో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మార్చి 26న ఆరంభం కాబోతున్న ఈసారి సీజన్లో అతడు

Updated : 14 Mar 2022 20:22 IST

ముంబయి: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున సత్తా చాటిన శ్రీలంక మాజీ స్టార్‌ పేసర్‌ లసిత్‌ మలింగ లీగ్‌లో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మార్చి 26న ఆరంభం కాబోతున్న ఈసారి సీజన్లో అతడు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించనున్నాడు. మలింగ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడని.. ప్యాడీ ఆప్టన్‌ను టీమ్‌ క్యాటలిస్ట్‌గా నియమించామని శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌ తెలిపింది. ‘‘మళ్లీ ఐపీఎల్‌కు రాబోతుండడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఆసక్తికరమైన బౌలింగ్‌ దళం ఉన్న రాజస్థాన్‌తో పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని మలింగ చెప్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్టన్‌ 2013-15 సీజన్లలో రాజస్థాన్‌కు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలో రాజస్థాన్‌, 2013, 15 సీజన్లలో టాప్‌-4లో నిలిచింది. 2013లో ఛాంపియన్స్‌ లీగ్‌కు కూడా అర్హత సాధించింది. గత సీజన్‌లో మాదిరే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రాజస్థాన్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని