Faf du Plessis: అందులో నేను, ధోని ఒకటే: డుప్లెసిస్‌

మహేంద్రసింగ్‌ ధోనికి తనకు కెప్టెన్సీ శైలిలో సారూప్యత ఉందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొత్త సారథి డుప్లెసిస్‌ అన్నాడు. ‘‘నా క్రికెట్‌ ప్రయాణంలో ఎంతోమంది అద్భుతమైన సారథులతో కలిసి ఆడడం అదృష్టంగా భావిస్తున్నా.

Updated : 14 Mar 2022 20:20 IST

బెంగళూరు: మహేంద్రసింగ్‌ ధోనికి తనకు కెప్టెన్సీ శైలిలో సారూప్యత ఉందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొత్త సారథి డుప్లెసిస్‌ అన్నాడు. ‘‘నా క్రికెట్‌ ప్రయాణంలో ఎంతోమంది అద్భుతమైన సారథులతో కలిసి ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌తోనే కెరీర్‌ ఆరంభం అయింది. ఆ తర్వాత పదేళ్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేంద్రసింగ్‌ ధోనితో లాంటి వాళ్లతో కలిసి ముందుకు సాగాను. సారథ్యం విషయంలో ధోనికి నాకు మధ్య ఉన్న ఏకైక సారూప్యత ప్రశాంతంగా ఉండడం. అయితే మిగిలిన విషయాల్లో మాత్రం ధోనికి నాకు పోలిక లేదు. మహి గొప్ప కెప్టెన్‌. ప్రపంచ క్రికెట్లోనే విజయవంతమైన సారథుల్లో ముందు వరుసలో ఉంటాడు. ఆరంభంలో నేను అనుకున్న దానికి మహి చాలా పూర్తిగా వ్యతిరేకం. అతడి శైలి చాలా భిన్నం’’ అని డుప్లెసిస్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని