IPL 2022: ఐపీఎల్‌ లైవ్‌పై హైకోర్టు కీలక తీర్పు

అనుమతి లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా అక్రమంగా ఆన్‌లైన్‌ ప్రసారాలు చేస్తున్న వెబ్‌సైట్లను తక్షణమే బ్లాక్‌ చేయాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ

Updated : 16 Mar 2022 07:02 IST

దిల్లీ: అనుమతి లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా అక్రమంగా ఆన్‌లైన్‌ ప్రసారాలు చేస్తున్న వెబ్‌సైట్లను తక్షణమే బ్లాక్‌ చేయాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నెల 26న ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో స్టార్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని