IPL 2022: ప్రత్యర్థులకు కోహ్లితో కష్టమే: మాక్స్‌వెల్‌

కెప్టెన్సీ భారం తొలగిపోవడంతో విరాట్‌ కోహ్లి ఒత్తిడి లేకుండా కనిపిస్తున్నాడని.. ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు అతడి నుంచి ముప్పు ఉన్నట్లేనని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

Published : 18 Mar 2022 07:51 IST

దిల్లీ: కెప్టెన్సీ భారం తొలగిపోవడంతో విరాట్‌ కోహ్లి ఒత్తిడి లేకుండా కనిపిస్తున్నాడని.. ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు అతడి నుంచి ముప్పు ఉన్నట్లేనని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ‘‘కెప్టెన్సీ భారం తొలగడంతో విరాట్‌ కోహ్లీపై ఒత్తిడి తగ్గిపోయింది. ఈసారి ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ఇది ప్రమాదకరమైన వార్తే. కెప్టెన్సీ లేకపోవడంతో అతడు మిగిలిన కెరీర్‌ను ఆస్వాదిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు సాగాలి. అతడికి ప్రత్యర్థిగా ఆడినప్పుడు కోహ్లి చాలా దూకుడుగా కనిపించేవాడు. మ్యాచ్‌లో ఎప్పుడూ లీనమై ఉండేవాడు. అయితే ఈ ఏడాది అతడి భావోద్వేగాలకు పరీక్షగా మారింది. విరాట్‌ ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అని మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని