IPL 2022: ఇక ఆలోచించేది లేదు.. రనౌట్ చేయడమే: అశ్విన్
బౌలర్ బంతి వేసే లోపు నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే మరో ఆలోచన లేకుండా వెంటనే రనౌట్ చేసేయాలని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ చెబుతున్నాడు. మన్కడింగ్ అని పిలుస్తున్న ఈ ఔట్‌ను.. అన్యాయమైన ఆట విభాగం నుంచి రనౌట్ కిందకు
చెన్నై: బౌలర్ బంతి వేసే లోపు నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే మరో ఆలోచన లేకుండా వెంటనే రనౌట్ చేసేయాలని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ చెబుతున్నాడు. మన్కడింగ్ అని పిలుస్తున్న ఈ ఔట్‌ను.. అన్యాయమైన ఆట విభాగం నుంచి రనౌట్ కిందకు మారుస్తూ ఇటీవల మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ఎంసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అశ్విన్ స్వాగతించాడు. 2019 ఐపీఎల్లో బట్లర్‌ను ఇలాగే అశ్విన్ రనౌట్ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. కానీ ఇప్పుడు ఎంసీసీ తీసుకున్న నిర్ణయంతో బౌలర్లు మరో ఆలోచన లేకుండా అలా రనౌట్ చేయాలని అశ్విన్ సూచిస్తున్నాడు. ‘‘నా ప్రియమైన సహచర బౌలర్లు.. దయచేసి అర్థం చేసుకోండి. నాన్ స్ట్రైకర్ వేసే ఆ ఒక్క అడుగు మీ కెరీర్లను నాశనం చేస్తుంది. దీని ప్రభావం ఎంతో ఉంటుంది. ముందుగానే పరుగుకు సిద్ధమై నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వేసే ఆ అడుగు కారణంగా అతను స్ట్రైక్‌లోకి రావొచ్చు. అంతకంటే ముందు బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్ ఔటయ్యే బంతిని.. ఇప్పుడు క్రీజులోకి వచ్చిన నాన్‌స్ట్రైకర్ సిక్సర్‌గా మలిచే అవకాశం ఉంది. వికెట్లు తీస్తే మీ కెరీర్ వృద్ధి చెందుతుంది. అదే సిక్సర్లు సమర్పించుకుంటే మాత్రం దెబ్బ పడుతుంది. అందుకే బౌలర్లు మరో ఆలోచన లేకుండా క్రీజు దాటిన నాన్ స్ట్రైకర్‌ను ఔట్ చేయాలన్నది నా అభిప్రాయం. బౌలర్ బంతి వేయకముందు నాన్ స్ట్రైకర్ క్రీజు దాటొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. నా పాఠశాల రోజుల్లో ఓ అబ్బాయి ఇష్టపడే అమ్మాయి ముందు అతని పేరును స్నేహితులు గట్టిగా అరిచేవాళ్లు. అలాగే ఇప్పుడు నేనాడుతుంటే ప్రేక్షకులు బట్లర్ అని అరుస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మేం ఒకే జట్టుకు ఆడబోతున్నాం’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ