IPL 2022: ఐపీఎల్ ఆటగాళ్లు లేకుండానే.. బంగ్లాతో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక
ఊహించినట్లే ఐపీఎల్లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నుంచి మినహాయింపు లభించింది. సొంతగడ్డపై జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుక్రవారం 15 మంది సభ్యుల జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా
జొహానెస్బర్గ్: ఊహించినట్లే ఐపీఎల్లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నుంచి మినహాయింపు లభించింది. సొంతగడ్డపై జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుక్రవారం 15 మంది సభ్యుల జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ)ప్రకటించింది. రబాడ, ఎంగిడి, మార్కో జాన్సెన్, మార్క్రమ్, డసెన్‌ల సేవల్ని దక్షిణాఫ్రికా కోల్పోనుంది. ఐపీఎల్లో ఆడాలా? టెస్టు సిరీస్‌లో బరిలో దిగాలా? అన్నది ఆటగాళ్లకే వదిలేస్తున్నట్లు సీఎస్ఏ స్పష్టంచేసింది. ఆటగాళ్లు లీగ్ వైపే మొగ్గుచూపారు. సీఎస్ఏతో దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (ఎస్ఏఎస్ఏ) ఒప్పందం ప్రకారం ఐపీఎల్లో పాల్గొనకుండా బోర్డు అడ్డుకోకూడదు. ఆటగాళ్ల జీవనోపాధి, అవకాశాలు.. జాతీయ జట్టుకు వారి సేవల్ని రెండు సంస్థలు సమన్వయం చేసేందుకు ప్రయత్నించాలి. ఈనెల 31న డర్బన్‌లో తొలి టెస్టు, ఏప్రిల్ 7న పోర్ట్ ఎలిజబెత్‌లో రెండో టెస్టు ప్రారంభమవుతాయి.
జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), బవుమా (వైస్ కెప్టెన్), డుపావిలాన్, సారెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, ముల్డర్, ఒలివియర్, కీగన్ పీటర్సన్, రికెల్టన్, సిపామ్లా, స్టుర్మన్, కైల్ వెరెనీ (వికెట్ కీపర్), లిజాడ్ విలియమ్స్, ఖాజా జోండో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య