Bangladesh: దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ (2-1)ను చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 24 Mar 2022 07:51 IST

సెంచూరియన్‌: బంగ్లాదేశ్‌ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ (2-1)ను చేజిక్కించుకొని చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తస్కిన్‌ అహ్మద్‌ (5/35) ధాటికి దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (39) మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌తో పాటు షకిబ్‌ (2/24), మెహదీ హసన్‌ మిరాజ్‌ (1/27), షోరిఫుల్‌ (1/37) కూడా సత్తా చాటారు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 26.3 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. తమిమ్‌ ఇక్బాల్‌ (87 నాటౌట్‌; 82 బంతుల్లో 14×4), లిటన్‌ దాస్‌ (48; 57 బంతుల్లో 8×4) సత్తా చాటారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు అవకాశమే లేకుండా చేశారు. తొలి వన్డేలో బంగ్లా గెలవగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నెగ్గింది. బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌ రసెల్‌ డొమింగో, బౌలింగ్‌ కోచ్‌ అలన్‌ డొనాల్డ్‌లు ఇద్దరూ దక్షిణాఫ్రికాకు చెందిన వాళ్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని