T20 Cricket: నేడు టీ20 లీగ్‌లో డబుల్‌ ధమాకా

అయిదు టైటిళ్లతో చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు.. ముంబయి ఇండియన్స్‌ మరోసారి కప్పు లక్ష్యంగా బరిలో దిగుతోంది. 15వ సీజన్‌కు ముందు జట్టులో ఆటగాళ్లు మారినా.. ప్రదర్శన మాత్రం తగ్గేదేలే అంటోంది.

Updated : 27 Mar 2022 09:24 IST

ముంబయి

యిదు టైటిళ్లతో చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు.. ముంబయి మరోసారి కప్పు లక్ష్యంగా బరిలో దిగుతోంది. మెగా టోర్నీకి ముందు జట్టులో ఆటగాళ్లు మారినా.. ప్రదర్శన మాత్రం తగ్గేదేలే అంటోంది. ఆదివారం మధ్యాహ్నం దిల్లీ క్యాపిటల్స్‌తో పోరుతో టైటిల్‌ వేట మొదలెట్టనుంది. మరోవైపు తొలి టైటిల్‌ కోసం నిరీక్షణ కొనసాగిస్తున్న బెంగళూరు, పంజాబ్‌ రెండో మ్యాచ్‌లో తలపడతాయి.

దూకుడు మంత్రం: 2021లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన ముంబయి.. ఈ సారి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని చూస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌, ఇషాన్‌, పోలార్డ్‌, బుమ్రాలు ఆ జట్టులో కీలకం. తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మకు అవకాశం దక్కుతుందేమో చూడాలి.

కళ్లన్నీ కోహ్లీపైనే..:  సీజన్‌లో తొలి పోరుకు బెంగళూరు సిద్ధమైంది. దశాబ్దం పాటు కెప్టెన్‌గా వ్యవహరించి ఇప్పుడు కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్న కోహ్లీపైనే అందరి కళ్లుంటాయనడంలో సందేహం లేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. మరోవైపు నూతన సారథి మయాంక్‌ ఆధ్వర్యంలో పంజాబ్‌ రాత మారుతుందేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని