Harbhajan Singh: ఇషాన్‌ అప్పట్లో నన్నూ బాదాడు

ముంబయి డాషింగ్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఒక మ్యాచ్‌లో అతడు తనకూ భారీ సిక్స్‌ల రుచి చూపించాడని భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు...

Updated : 29 Mar 2022 08:26 IST

ముంబయి: ముంబయి డాషింగ్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఒక మ్యాచ్‌లో అతడు తనకూ భారీ సిక్స్‌ల రుచి చూపించాడని భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. దిల్లీతో మ్యాచ్‌లో కిషన్‌ 48 బంతుల్లోనే 81 పరుగులు చేసిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘దిల్లీపై కిషన్‌ ఇన్నింగ్స్‌ చూశాక ముంబయి యాజమాన్యం చాలా ఆనందించి ఉంటుంది. అతణ్ని రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కున్న ఆ జట్టు ప్రతిఫలం పొందుతోంది. ఇప్పుడు కిషన్‌లో మరింత పరిణతి కనిపిస్తోంది. దిల్లీతో పోరులో కెప్టెన్‌ రోహిత్‌ ఔటైనా.. అతడు చివరి వరకు నిలిచి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కిషన్‌కు నేను అభిమానిని. ఒక మ్యాచ్‌లో కిషన్‌ నా బౌలింగ్‌లో నాలుగు సిక్సర్ల దాకా బాదాడు. అతను మంచి బ్యాటర్‌ అవుతాడని అప్పుడే అనిపించింది. ఇప్పుడు పెవిలియన్‌లో కూర్చొని కిషన్‌ ఆటను ఆస్వాదిస్తున్నా’’ అని భజ్జీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు