Virat Kohli: నేను రొనాల్డో అయితే..

ఓ రోజు ఉదయం   నిద్ర లేచే సరికి తాను ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోగా మారి ఉంటే  తన మెదడును స్కాన్‌ తీస్తానని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు.

Updated : 05 Apr 2022 09:28 IST

ముంబయి: ఓ రోజు ఉదయం నిద్రలేచే సరికి తాను ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోగా మారి ఉంటే  తన మెదడును స్కాన్‌ తీస్తానని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. రొనాల్డోకు వీరాభిమాని అయిన కోహ్లి.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫొటోషూట్‌ సందర్భంగా ఆ ఫుట్‌బాలర్‌ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఒకవేళ నేను పొద్దున్నే లేచేసరికి  రొనాల్డోగా మారిపోయి ఉంటే వెంటనే నా మెదడును స్కాన్‌ చేయిస్తా. అతడికి అంత మానసిక దృఢత్వం ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తా’’ అని అన్నాడు.

బస్సెక్కి.. బాల్యంలోకి

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఒక్కసారిగా బస్సెక్కి బాల్యంలోకి వెళ్లిపోయాడు. చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఇదంతా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శివాజీ పార్క్‌కు వెళ్లే బస్సు ఫుట్‌బోర్డుపై నిలబడి సచిన్‌ దిగిన ఫొటో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ‘‘తిరిగి బాల్యంలోకి’’ అనే శీర్షికతో సచిన్‌ ఈ ఫొటోను సోమవారం పోస్టు చేశాడు. చిన్నతనంలోనే క్రికెట్‌ మొదలెట్టిన అతను.. ప్రాక్టీస్‌, మ్యాచ్‌ల కోసం ముంబయి బస్సుల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జ్ఞాపకాలను మరోసారి మాస్టర్‌ బ్లాస్టర్‌ నెమరేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని