Ravi Shastri: తిలక్ వర్మ ఆట ముచ్చటేస్తోంది: రవిశాస్త్రి
తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుంటోందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఈ సీజన్లో టీ20 క్రికెట్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల తిలక్
ముంబయి: తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుంటోందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఈ సీజన్లో టీ20 క్రికెట్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల తిలక్ ముంబయి తరపున అదరగొడుతున్న సంగతి తెలిసిందే. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ధనాధన్ ఇన్నింగ్స్‌తో 61 పరుగులు చేశాడు. ‘‘ముంబయికి ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల్లో తిలక్ తన సామర్థ్యాన్ని చాటాడు. ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్, స్వీప్.. ఇలా అతను ఎన్నో రకాలుగా ఆడుతున్న షాట్లు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. అతని ఆట ఆకట్టుకుంది. తన షాట్ల ఎంపికలో ఎంతో వైవిధ్యం ఉంది. ఆ ప్రశాంతత, శరీర భాష, స్వభావం ఓ యువ ఆటగాడిగా తనకెంతో మంచిది. గొప్ప ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కెరీర్లో చాలా దూరం వెళ్లే సత్తా అతనికి ఉంది. తన బ్యాటింగ్‌లో సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాడు. ముంబయికి ఇది శుభ పరిణామం. ఒక్కసారి సూర్యకుమార్ తిరిగి జట్టులో చేరితే మిడిలార్డర్ మరింత బలంగా మారుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు