Ganguly - Jay Shah: ఆ పదవి కోసం గంగూలీ X జై షా పోటీ?

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలు ఇద్దరూ ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై కన్నేసినట్లు సమాచారం. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే త్వరలో ముగియనుంది. పదవీకాలాన్ని పొడిగించుకోరాదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 07 Apr 2022 07:00 IST

ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలు ఇద్దరూ ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై కన్నేసినట్లు సమాచారం. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే త్వరలో ముగియనుంది. పదవీకాలాన్ని పొడిగించుకోరాదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో 2023 ప్రపంచకప్‌ జరిగే సమయంలో భారతీయుడే ఐసీసీ ఛైర్మన్‌గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గంగూలీ, షా ఆ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఐసీసీ ఛైర్మన్‌ పదవీకాలం రెండేళ్లు. ఓ ఛైర్మన్‌ గరిష్టంగా ఆరేళ్లు పదవిలో ఉండొచ్చు. పేరున్న న్యాయవాది అయిన బార్క్‌లే తీరిక లేని కారణంగా మరోసారి పోటీలో ఉండడానికి సిద్ధంగా లేడని సమాచారం. కొన్నేళ్ల నుంచి కలిసి బీసీసీఐని నడిపిస్తున్న గంగూలీ, షా.. ఒకే పదవికి వేర్వేరుగా పోటీ పడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి వీళ్లిద్దరిలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని