Faf duplessis: కెప్టెన్‌గా డుప్లెసిస్‌ గొప్పగా రాణిస్తాడు

బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరి గౌరవాన్ని పొందుతున్నాడని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు. ‘‘కెప్టెన్‌గా డుప్లెసిస్‌ గొప్పగా రాణించబోతున్నాడని

Updated : 08 Apr 2022 06:54 IST

ముంబయి: బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరి గౌరవాన్ని పొందుతున్నాడని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు. ‘‘కెప్టెన్‌గా డుప్లెసిస్‌ గొప్పగా రాణించబోతున్నాడని భావిస్తున్నాం. ఈ సీజన్‌ను ఆరంభించిన తీరు చూస్తేనే డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరూ అతణ్ని ఎంతో గౌరవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. డుప్లెసిస్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు’’ అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. జట్టులో సీనియర్‌ ఆటగాళ్లంతా అతడికి సహకరించాలని, భారాన్ని పంచుకోవాలని అతను సూచించాడు. తాను ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుదామా అన్న ఉత్సాహంతో ఉన్నట్లు మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. తన వివాహం కారణంగా మ్యాక్సీ బెంగళూరు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. 9న ముంబయితో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని