Ravichandran Ashwin: నేను అందుకే వెళ్లాల్సి వచ్చింది.. రిటైర్డ్‌ ఔట్‌పై అశ్విన్‌ ఏమన్నాడంటే?

లఖ్‌నవూతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయంపై ఇప్పుడు అశ్విన్‌ కూడా స్పందించాడు. తన నిర్ణయం గురించి వివరించాడు. ‘‘అది వ్యూహాత్మక నిర్ణయం. గౌతమ్‌ తర్వాత

Updated : 12 Apr 2022 08:24 IST

(Photo: Ravichandran Ashwin Instagram)

ముంబయి: లఖ్‌నవూతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయంపై ఇప్పుడు అశ్విన్‌ కూడా స్పందించాడు. తన నిర్ణయం గురించి వివరించాడు. ‘‘అది వ్యూహాత్మక నిర్ణయం. గౌతమ్‌ తర్వాత నేను క్రీజులోకి వచ్చా. ఆఖర్లో షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే కుదరలేదు. ఆ సమయంలో పరాగ్‌ వచ్చి రెండు సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందని ఆలోచించా. అందుకే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగా. ఇలాంటి నిర్ణయాలు కొన్నిసార్లు పని చేస్తాయి. కొన్నిసార్లు పనిచేయవు’’ అని అన్నాడు.

అది సరైన సమయం

మ్యాచ్‌ పరిస్థితిని అశ్విన్‌ బాగా అర్థం చేసుకున్నాడని, సరైన సమయంలో రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడని రాజస్థాన్‌ డైరెక్టర్‌ కుమార్‌ సంగక్కర అన్నాడు.  ‘‘అశ్విన్‌ సరైన సమయంలోనే ఆ పని చేశాడు. అలా ఔటవుతానని అతడే స్వయంగా మైదానం నుంచి కోరాడు. అంతకుముందే రిటైర్డ్‌ ఔట్‌ గురించి చర్చించాం’’ అని సంగక్కర చెప్పాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ పరిస్థితిని అర్థం చేసుకుని చక్కగా ఆడాడు’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని