Updated : 15 Apr 2022 08:08 IST

Deepak Chahar: టీ20 ప్రపంచకప్‌నకూ దీపక్‌ చాహర్‌ దూరం!

చెన్నై: గాయం కారణంగా పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ఈ సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో చెన్నైకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు కూడా అతడు దూరం కానున్నాడు. అతడి స్కానింగ్‌ ఫలితాలు వచ్చాయి. వెన్ను గాయం వల్ల అతడు కనీసం నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సివుంటుంది. నిజానికి చాహర్‌ ఈ టీ20 క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ సగభాగానికైనా అందుబాటులో ఉంటాడని చెన్నై ఆశించింది. జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావసంలో అతడు దాదాపుగా కోలుకున్నాడు. నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం కూడా మొదలెట్టాడు. కానీ ఇంతలోనే అతడికి వెన్ను గాయమైంది. వేలంలో అతణ్ని చెన్నై రూ.14 కోట్లకు కొనుక్కుంది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts