Virat Kohli: షేన్‌వార్న్‌తో సంభాషణ ఒక అభ్యాసం: విరాట్‌ కోహ్లి

ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌ వార్న్‌తో ప్రతి సంభాషణ ఒక అభ్యాసంగా ఉంటుందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘‘కొన్నిసార్లు వార్న్‌ చర్యల్ని కాపీ కొట్టేందుకు

Updated : 16 Apr 2022 07:25 IST

ముంబయి: ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌ వార్న్‌తో ప్రతి సంభాషణ ఒక అభ్యాసంగా ఉంటుందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘‘కొన్నిసార్లు వార్న్‌ చర్యల్ని కాపీ కొట్టేందుకు ప్రయత్నించా. క్రికెట్‌ పరంగా నాపై అతని ప్రభావం అలాంటిది. అతనో అద్భుతమైన మానవతావాది. మైదానం ఆవల కూడా వార్న్‌తో మాట్లాడే అవకాశం లభించింది. అతనో సానుకూల వ్యక్తి. అతని సంభాషణలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఉండేవి. వాటి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. టెస్టులు, ఆట గురించి అతనెంతో ఇష్టంగా మాట్లాడతాడు. క్రికెట్‌ అంటే వార్న్‌కు ఎంతో ప్రేమ. అతని మృతి ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. అయితే వార్న్‌ కెరీర్‌, ఘనతలు, జీవితం, నచ్చినట్లుగా జీవించిన విధానాన్ని మనం చిరునవ్వుతో చూసుకోవచ్చు. బహుశా నేను కలుసుకున్న వ్యక్తుల్లో అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు అతడే’’ అని కోహ్లి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని