Ravi Shastri: ఈసారి కొత్త ఛాంపియన్‌.. శాస్త్రి ఎవరిమీద నమ్మకం పెట్టుకున్నాడంటే?

ఈ సారి మెగా టీ20లో కొత్త ఛాంపియన్‌ను చూసే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. బెంగళూరు మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగువుతోందని..

Updated : 18 Apr 2022 07:04 IST

దిల్లీ: ఈ సారి మెగా టీ20లో కొత్త ఛాంపియన్‌ను చూసే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. బెంగళూరు మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగువుతోందని.. ఆ జట్టు కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరుతుందని అతను అంచనా వేశాడు. ‘‘ఈ సీజన్‌లో కొత్త విజేతను చూస్తామని నమ్ముతున్నా. ఈసారి బెంగళూరు ట్రోఫీ దిశగా దూసుకెళ్తోంది. ఆ జట్టు కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. టోర్నీ సాగిన కొద్దీ ఆ జట్టు బలంగా మారుతోంది. ప్రతి మ్యాచ్‌కూ మెరుగవుతూ సాగుతోంది. విరాట్‌ మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. జట్టుతో చేరిన మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌తో ఎంతటి విధ్వంసం సృష్టించగలడో తెలిసిందే. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను అలవోకగా సిక్సర్లు బాదగలడు. బెంగళూరు దృక్కోణం నుంచి చూస్తే అతనెంతో ముఖ్యమైన ఆటగాడు. మరోవైపు డుప్లెసిస్‌ నాయకత్వం ఆ జట్టుకు అదనపు బలం’’ అని అతను పేర్కొన్నాడు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా విజేతగా నిలవని బెంగళూరు.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని