Sunil Gavaskar: ప్రపంచకప్‌లో కార్తీక్‌ ఫినిషర్‌ పాత్ర పోషించగలడు

వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఫినిషర్‌ పాత్ర పోషించగలడని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున

Updated : 20 Apr 2022 06:57 IST

ముంబయి: వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఫినిషర్‌ పాత్ర పోషించగలడని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున కార్తీక్‌ అదరగొడుతున్నాడు. 205.88 స్రైక్‌రేటుతో వరుసగా 32, 14, 44, 7, 34, 66, 13తో చెలరేగాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన కార్తీక్‌ 210 సగటుతో సత్తాచాటాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు కార్తీక్‌ చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే.. అతని వయసును కాదు ప్రదర్శనను చూడండి. అతని ఆటతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. పొట్టి కప్పులో ఆరు లేదా ఏడో నంబరు బ్యాటర్‌ నుంచి ఆశించే పని చేస్తున్నాడు’’ అని గావస్కర్‌ తెలిపాడు. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ ఆరంభంకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని