అలా ఎందుకంటారో చాహల్‌ చూపించాడు

టీ20లో లెగ్‌ స్పిన్నర్లను మ్యాచ్‌ విన్నర్లుగా ఎందుకు పరిగణిస్తారో చాహల్‌ చూపించాడని రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగ అన్నాడు. సోమవారం కోల్‌కతాతో మ్యాచ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌

Updated : 20 Apr 2022 07:04 IST

ముంబయి: టీ20లో లెగ్‌ స్పిన్నర్లను మ్యాచ్‌ విన్నర్లుగా ఎందుకు పరిగణిస్తారో చాహల్‌ చూపించాడని రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగ అన్నాడు. సోమవారం కోల్‌కతాతో మ్యాచ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో విజృంభించి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. ‘‘చాహల్‌కు ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉంది. దేశంలో, టోర్నీలో అత్యంత అనుభవం కలిగిన లెగ్‌ స్పిన్నర్‌ అతనే. నైపుణ్యంపై పట్టు సాధించడమెలాగో చూపించాడు. భవిష్యత్తులో ఏ స్థాయి పోటీ క్రికెట్లోనైనా ఆడగలడనని నిరూపించుకోడానికి  అతనికి అదెంతో కీలకం. లెగ్‌ స్పిన్నర్లకు వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వికెట్లు ఎలా తీయగలడో అతను చూపించాడు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ను మార్చేశాడు. టోర్నీలో లెగ్‌ స్పిన్నర్లను మ్యాచ్‌ విన్నర్లుగా ఎందుకు పరిగణిస్తారో చాహల్‌ చూపించాడు’’ అని మలింగ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు