Mumbai vs Chennai: మాజీ ఛాంపియన్లకు చావోరేవో

టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. ముంబయి  నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌. అయితే ఈ రెండు జట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి

Published : 21 Apr 2022 07:25 IST

చెన్నై, ముంబయి జట్ల మధ్య పోరు నేడు

ముంబయి: టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. ముంబయి  నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌. అయితే ఈ రెండు జట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సగం లీగ్‌ పూర్తవకముందే ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఒక్కదాంట్లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబయి పదో స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్‌లో ఓడితే ముంబయికి ప్లేఆఫ్స్‌ ద్వారాలు మూసుకుపోయినట్లే. చెన్నైది దాదాపు అలాంటి పరిస్థితే. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్‌లో చెన్నై, ముంబయి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబయి బోణీ చేస్తుందా? ప్లేఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుందా? లేదా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైని విజయం వరిస్తుందా? ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుందా? అన్నది చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని