Mumbai: ముంబయి జట్టులో లుకలుకలు!

ముంబయి జట్టులో అంతర్గతంగా లుకలుకలున్నట్లుగా అనిపిస్తోందని, అదే ఆ జట్టు వైఫల్యానికి కారణమవుతోందని ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్‌ లిన్‌ అభిప్రాయపడ్డాడు. తాను ముంబయి జట్టులో

Updated : 23 Apr 2022 06:56 IST

దిల్లీ: ముంబయి జట్టులో అంతర్గతంగా లుకలుకలున్నట్లుగా అనిపిస్తోందని, అదే ఆ జట్టు వైఫల్యానికి కారణమవుతోందని ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్‌ లిన్‌ అభిప్రాయపడ్డాడు. తాను ముంబయి జట్టులో ఉన్నప్పటి సమన్వయం, పరస్పర సహకారం ఇప్పటి జట్టులో కనిపించడం లేదని అతనన్నాడు. మెగా టోర్నీలో అత్యధికంగా అయిదు టైటిళ్లు గెలిచిన ముంబయి.. ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన నేపథ్యంలో అతనీ వ్యాఖ్యలు చేశాడు. ‘‘విజయం ఒక అలవాటుగా మారినట్లే.. కొన్నిసార్లు ఓటమి కూడా అలవాటుగా మారుతుంది. ముంబయికి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింట్లోనూ సమస్యలున్నాయి. అలాగే వారి మానసిక స్థితిలోనూ. జట్టులో అంతర్గత సమస్యలున్నట్లు అనిపిస్తోంది. కెప్టెన్‌ సమస్యలో ఉన్నపుడు కెప్టెన్‌కు పొలార్డ్‌ లాంటి సీనియర్లు పరుగెత్తుకొచ్చి సాయం చేయాలి. ఇప్పుడు అలాంటి దృశ్యాలేమీ కనిపించడం లేదు. జట్టులో వర్గాలు ఏర్పడినట్లుగా ఉంది. ఎవరికి వారుగా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు మైదానాన్ని విడిచి వెళ్లిపోదాం అన్నట్లు కనిపిస్తున్నారు. అది సరైన సంకేతం కాదు. రెండేళ్ల కిందట ముంబయి టైటిల్‌ గెలిచిన ఏడాది.. మనం ఇంకా ఎలా మెరుగు పడాలి అనే చర్చ నిరంతరం సాగుతుండేది. ఇప్పుడలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. 11 మంది ఆటగాళ్లు ఎవరికి వారన్నట్లుగా ఉంటున్నారు. జట్టుగా కనిపించట్లేదు. త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుని మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ముంబయి లాంటి మంచి జట్టు బాగా ఆడితే ప్రపంచ క్రికెట్‌కు మంచిది’’ అని లిన్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని