Sunil Gavaskar: ధోని నుంచి హార్దిక్‌ విలువైన పాఠాలు నేర్చుకున్నాడు: గావస్కర్‌

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ మెగా టోర్నీలో సరికొత్తగా కనిపిస్తున్నాడని, అతడి ఆట ఎంతో మెరుగు పడిందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘ఈ మెగా టోర్నీకి ముందు హార్దిక్‌ పెద్దగా క్రికెట్‌ ఆడలేదు. ఇప్పుడు మనం కొత్త హార్దిక్‌ను చూస్తున్నాం.

Updated : 24 Apr 2022 07:08 IST

ముంబయి: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ మెగా టోర్నీలో సరికొత్తగా కనిపిస్తున్నాడని, అతడి ఆట ఎంతో మెరుగు పడిందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘ఈ మెగా టోర్నీకి ముందు హార్దిక్‌ పెద్దగా క్రికెట్‌ ఆడలేదు. ఇప్పుడు మనం కొత్త హార్దిక్‌ను చూస్తున్నాం. అతనెంతో మెరుగు పడ్డాడు. వివిధ రకాల పరిస్థితుల్లో అతను చక్కగా రాణించాడు. నాలుగో స్థానంలో ఎంతో బాధ్యతతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ధోని నుంచి హార్దిక్‌ విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి గొప్ప ఆటగాళ్ల సహవాసం మేలు చేస్తుంది. దాని ప్రభావమే హార్దిక్‌లో కనిపిస్తోంది. హార్దిక్‌ ఇప్పుడు ఆలోచించి ఆడుతున్నాడు. అలా చేస్తే కచ్చితంగా ఆట మెరుగు పడుతుంది. తన బ్యాటింగ్‌లో క్రమశిక్షణ కనిపిస్తోంది. పవర్‌ ప్లేలో ఫీల్డింగ్‌ పరిమితుల్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు’’ అని సన్నీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని