టీ20 మెగా టోర్నీ డబ్బు మా మధ్య చిచ్చు పెట్టింది

టీ20 మెగా టోర్నీ.. కష్టాల్లో ఉన్న ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ లీగ్‌ డబ్బు కారణంగానే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకెల్‌

Published : 25 Apr 2022 07:36 IST

సిడ్నీ: టీ20 మెగా టోర్నీ.. కష్టాల్లో ఉన్న ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ లీగ్‌ డబ్బు కారణంగానే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌కు, తనకు విభేదాలు వచ్చాయని ఆ జట్టు మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ చెప్పాడు. ఆసీస్‌కు ఆడే సమయంలో వీళ్ల మధ్య స్నేహం.. ఈ టోర్నీ వల్ల వైరంగా మారిందట. ఓ సారి జట్టు సమావేశానికి రాకుండా చేపల వేటకు వెళ్లినందుకు సైమండ్స్‌ను వన్డే సిరీస్‌ నుంచి క్లార్క్‌ ఇంటికి పంపించాడు. 2008లో ఓ వన్డే ఆడేందుకు వచ్చినపుడు సైమండ్స్‌ మద్యం సేవించి ఉన్నాడని కూడా క్లార్క్‌ ఆరోపించాడు. 2015లో క్లార్క్‌ నాయకత్వ శైలిపై సైమండ్స్‌ విమర్శలు చేశాడు. ఇలా తామిద్దరం ఒకరపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి, తమ మధ్య దూరం పెరగడానికి ఈ టోర్నీ డబ్బే కారణం కావొచ్చని తాజాగా సైమండ్స్‌ వెల్లడించాడు. 2008లో లీగ్‌ ఆరంభ సీజన్‌లో అప్పటి హైదరాబాద్‌ జట్టు అతణ్ని రూ.5.4 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా అతను నిలిచాడు. ‘‘క్లార్క్, నేను చాలా సన్నిహితంగా మెలిగేవాళ్లం. అతను జట్టులోకి వచ్చిన తర్వాత కలిసి చాలాసార్లు బ్యాటింగ్‌ చేశాం. మా మధ్య స్నేహం పెరిగింది. అయితే ఈ మెగా టోర్నీలో నాకు భారీ ధర దక్కడంతో క్లార్క్‌కు అసూయ మొదలైందని హేడెన్‌ నాతో చెప్పాడు. బహుశా మా బంధానికి పొగబెట్టింది ఆ డబ్బే అనుకుంటా. ఇప్పుడతనితో నాకు స్నేహం లేదు. కానీ తనపై బురద చల్లే ప్రయత్నం మాత్రం చేయను’’ అని సైమండ్స్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు