Boria Majumdar: బోరియాపై రెండేళ్ల నిషేధం?

క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించే అవకాశముంది. ఇంటర్వూ కోసం బోరియా.. వికెట్‌ కీపర్‌ సాహాను బెదిరించడం నిజమేనని ముగ్గురు సభ్యుల కమిటీ

Updated : 25 Apr 2022 06:54 IST

ముంబయి: క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించే అవకాశముంది. ఇంటర్వూ కోసం బోరియా.. వికెట్‌ కీపర్‌ సాహాను బెదిరించడం నిజమేనని ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చిన నేపథ్యంలో బోర్డు అతడిపై చర్యలు తీసుకోనుంది. ‘‘బోరియాను స్టేడియాల్లో రానివ్వొద్దని అన్ని రాష్ట్రా సంఘాలతో చెబుతాం. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం అతడికి అక్రిడేషన్‌ ఇవ్వం. అతణ్ని నిషిద్ధ జాబితాలో ఉంచాలని ఐసీసీకి కూడా లేఖ రాస్తాం. అతడితో మాట్లాడవద్దని ఆటగాళ్లను ఆదేశిస్తాం’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇంటర్వూ కోసం బోరియా తనను బెదిరించాడంటూ ఫిబ్రవరిలో సాహా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బోరియా నుంచి వాట్సాప్‌లో వచ్చిన సందేశాల స్క్రీన్‌ షాట్లను కూడా అతడు ట్విట్టర్లో పెట్టాడు. ‘‘నువ్వు ఫోన్‌ చేయలేదు. ఇంకెప్పుడూ నిన్ను ఇంటర్వ్యూ చేయను. ఈ అవమానాన్ని నేను తేలిగ్గా తీసుకోను. దీన్ని గుర్తుంచుకుంటా’’ అన్నది బోరియా సందేశాల్లో ఒకటి. సాహా ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు ప్రభ్‌తేజ్‌ భాటియాలతో బీసీసీఐ కమిటీని ఏర్పాటు చేసింది. సాహా, మజుందార్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ.. మజుందార్‌ను దోషిగా తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని