Ravindra Jadeja: టీమ్‌ఇండియాకు జడేజా సారథ్యం వహించగలడు: రాయుడు

ఏదో ఒకరోజు టీమ్‌ఇండియాకు సారథ్యం వహించే సామర్థ్యం రవీంద్ర జడేజాలో ఉందని చెన్నై బ్యాటర్‌ అంబటి రాయుడు అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమని రాయుడు తెలిపాడు.

Published : 26 Apr 2022 07:09 IST

ముంబయి: ఏదో ఒకరోజు టీమ్‌ఇండియాకు సారథ్యం వహించే సామర్థ్యం రవీంద్ర జడేజాలో ఉందని చెన్నై బ్యాటర్‌ అంబటి రాయుడు అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమని రాయుడు తెలిపాడు. ‘‘ధోని స్థానాన్ని భర్తీ చేయడం ఎప్పటికీ జరగని పని. కానీ జడేజా సమర్థుడు. ధోని  మార్గనిర్దేశనం.. అతను మైదానంలో ఉన్నంత వరకు జడేజాకు సారథ్యం సులువే. అతను మరింత మెరుగవుతాడు కూడా. చెన్నై ఒక్కటే కాదు ఏదో ఒకరోజు టీమ్‌ఇండియాకు సారథ్యం వహించగల సామర్థ్యం జడేజాలో ఉంది. చెన్నై జట్టు సంధి దశలో ఉంది. రానున్న కాలంలో చాలామంది యువ ఆటగాళ్లు చెన్నై జట్టులో కొనసాగుతారు. జడేజా వంటి యువ సారథిని కలిగి ఉండటం.. అతని ఆటతీరును చూడటం వారికి సానుకూలాంశమే. వాళ్లకు కెప్టెన్‌ మద్దతు ఉంటుంది. జట్టు కోణంలో చూస్తే జడేజా సరైన దిశలో ప్రయాణిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో చెన్నై చాలా చాలా విజయవంతమవుతుంది’’ అని రాయుడు వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని