Ravi Shastri - Virat Kohli: కోహ్లి.. ఈ టోర్నీ నుంచి తప్పుకో: రవిశాస్త్రి

పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్‌ కోహ్లి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అవసరమైతే టీ20 నుంచి తప్పుకోవాలని సూచించాడు.

Updated : 28 Apr 2022 06:54 IST

దిల్లీ: పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్‌ కోహ్లి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అవసరమైతే టీ20 నుంచి తప్పుకోవాలని సూచించాడు. ‘‘ఏకధాటిగా క్రికెట్‌ ఆడుతున్న విరాట్‌కు విరామం అవసరం. మూడు ఫార్మాట్లలో జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతను విశ్రాంతి తీసుకోవడం సముచితం. కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకోవాలన్నా.. ఆరేడేళ్లు తనదైన ముద్ర వేయాలన్నా.. తక్షణం ఈ టోర్నీ నుంచి వైదొలగాలి. ఎవరికైనా నేను ఇదే మాట చెప్తా. టీమ్‌ఇండియాకు ఆడుతూ.. రాణించాలనుకునే వాళ్లు ఒక రేఖ గీసుకోవాలి. టీమ్‌ఇండియాకు మ్యాచ్‌లు లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

కోహ్లి బయటపడతాడు.. బంగర్‌: వైఫల్యాల నుంచి కోహ్లి బయటపడతాడని బెంగళూరు చీఫ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ‘‘కోహ్లి గొప్ప ఆటగాడు. గతంలో ఎన్నోసార్లు ఎత్తుపల్లాలు చూసిన అనుభవం అతని సొంతం. ఈ విషయంలో కోహ్లీని చాలా దగ్గరగా గమనించా. అతనిలో ప్రేరణకు కొదవలేదు. ఈ తక్కువ స్కోర్ల నుంచి అతను బయటపడతాడు. రానున్న కీలక మ్యాచ్‌ల్లో జట్టు విజయాలకు సహాయం అందిస్తాడు. ప్రాక్టీసులో అతను కష్టపడే దృక్పథం ప్రశంసనీయం. కోహ్లి నుంచి తక్కువ స్కోర్లే వచ్చినా మానసికంగా అతనెంతో దృఢంగా ఉన్నాడు. కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కోవడం చాలాజట్లకు సవాల్‌గా మారడం చూస్తున్నాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతుండటంతో గెలవాల్సిన మ్యాచ్‌లు చేజారుతున్నాయి’’ అని బంగర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని