Virat Kohli: ఊ అంటావా కోహ్లి

బెంగళూరు ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు భారత సంప్రదాయ వస్త్రధారణతో తళుక్కుమన్నారు. విదేశీ క్రికెటర్లు కుర్తా, పైజామా.. వాళ్ల భార్యలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఇక ఆటగాళ్లందరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి

Updated : 29 Apr 2022 07:35 IST

పుష్ప పాటకు స్టెప్పులేసిన విరాట్‌

ముంబయి: బెంగళూరు ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు భారత సంప్రదాయ వస్త్రధారణతో తళుక్కుమన్నారు. విదేశీ క్రికెటర్లు కుర్తా, పైజామా.. వాళ్ల భార్యలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఇక ఆటగాళ్లందరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మామ’ పాటకు స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ సందడంతా ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ వివాహానంతర విందులో భాగంగా జరిగింది. గత నెల 18న భారత సంతతికి చెందిన విని రామన్‌ను మ్యాక్సీ ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత  టీ20 కోసం ఆ దంపతులు భారత్‌కు వచ్చేశారు. ఇప్పుడు తన సహచర ఆటగాళ్లకు మ్యాక్స్‌వెల్‌ విందు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా బెంగళూరు ఆటగాళ్లు సందడి చేశారు. ముఖ్యంగా షాబాజ్‌తో కలిసి పుష్ప పాటకు కోహ్లి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. మరోవైపు కెప్టెన్‌ డుప్లెసిస్‌, అతని భార్య సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని