Virat Kohli: కోహ్లి అలా ఔటవుతుండటం ఆందోళనకరం
భిన్నమైన బౌలర్ల చేతుల్లో విరాట్ కోహ్లి ఔటవుతుండటం ఆందోళనకరమని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డాడు. టీ20 లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగే కోహ్లి ఈ సీజన్లో 11 మ్యాచ్‌ల్లో
దిల్లీ: భిన్నమైన బౌలర్ల చేతుల్లో విరాట్ కోహ్లి ఔటవుతుండటం ఆందోళనకరమని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డాడు. టీ20 లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగే కోహ్లి ఈ సీజన్లో 11 మ్యాచ్‌ల్లో 216 పరుగులు రాబట్టాడు. ‘‘గత కొంతకాలంగా 10-15 స్కోరు వరకు కోహ్లి బంతికి ఒక పరుగు కంటే తక్కువగా లేదా బంతికో పరుగు చొప్పున ఆడుతున్నాడు. దాన్ని దాటుకుని ముందుకు వెళ్లలేకపోతున్నాడు. కసి కూడా కనిపించడం లేదు. చెన్నైతో మ్యాచ్‌లో పేసర్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ బాదడంతో కోహ్లి స్కోరు బంతికో పరుగులా మారింది. కొద్దిసేపటికే అతను ఔటయ్యాడు. గత సీజన్లోనూ ఇలాగే జరిగింది. పరుగులు రాబట్టడంలో వేగం తగ్గడం ఆందోళనకరమే. బంతికో పరుగు సాధిస్తున్నప్పుడు ఇన్నింగ్స్‌లో ఎక్కువసేపు ఆడాలి. కోహ్లి అలా చేయడం లేదు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భిన్నమైన బౌలర్ల చేతుల్లో కోహ్లి ఔటవుతుండటం ఆందోళన కలిగిస్తుంది’’ అని బిషప్ వివరించాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ