బంగ్లాదేశ్‌కు ఆధిక్యం

డ్రాకే అవకాశాలెక్కువగా ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బంగ్లాకు 68 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

Published : 19 May 2022 02:06 IST

చట్టోగ్రామ్‌: డ్రాకే అవకాశాలెక్కువగా ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బంగ్లాకు 68 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 318/3తో బుధవారం, నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు 465 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (105) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లిటన్‌ దాస్‌ (88)తో నాలుగో వికెట్‌కు అతడు.. 201 పరుగులు జోడించాడు. టెస్టుల్లో ఎనిమిదో శతకం చేసిన ముష్ఫికర్‌.. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. దిముత్‌ కరుణరత్నె (18), ఎంబుల్దెనియా (2) క్రీజులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని