కాంస్యం కోసం మిక్స్‌డ్‌ జోడీ పోరు

దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్‌ స్టేజ్‌-2 ఆర్చరీ టోర్నమెంట్లో భారత కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్యం కోసం పోరాడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్‌వర్మ, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత్‌ జట్టు 156-158తో ఇస్తోనియా చేతిలో ఓడింది.

Published : 21 May 2022 02:20 IST

గ్వాంగ్జూ: దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్‌ స్టేజ్‌-2 ఆర్చరీ టోర్నమెంట్లో భారత కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్యం కోసం పోరాడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్‌వర్మ, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత్‌ జట్టు 156-158తో ఇస్తోనియా చేతిలో ఓడింది. అంతకుముందు అభిషేక్‌ ద్వయం 157-155తో డెన్మార్క్‌ను ఆ తర్వాత 156-153తో మెక్సికోను ఓడించింది. కాంస్య పతక పోరులో టర్కీతో భారత్‌ తలపడనుంది. రికర్వ్‌లో మన ఆర్చర్లు విఫలమయ్యారు. మిక్స్‌డ్‌ టీమ్‌ ప్రిక్వార్టర్స్‌లో 5-3తో జపాన్‌ జంటపై గెలిచిన తరుణ్‌దీప్‌ రాయ్‌-రిధి జోడీ.. క్వార్టర్స్‌లో 1-5తో జర్మనీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌దీప్‌ రాయ్‌ 2-6తో కిమ్‌ వుజిన్‌ (కొరియా) చేతిలో పరాజయం పాలవగా.. జయంత్‌ తాలుక్‌దార్‌ 5-6తో కిమ్‌ వుజిన్‌ చేతిలోనే పోరాడి ఓడాడు. తొలి రెండు సెట్లలో ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత తడబడిన తాలుక్‌దార్‌.. షూటాఫ్‌లో ఓడిపోయాడు. మహిళల రికర్వ్‌ సింగిల్స్‌లో కోమలిక బారి, రిధి కూడా ఓడిపోయారు. కోమలిక 4-6తో యాస్మిన్‌ (టర్కీ) చేతిలో ఓడగా.. రిధి 5-6తో లీ గయున్‌ (కొరియా)పై షూటాఫ్‌లో ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని