డెఫ్‌లింపిక్స్‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం

బ్రెజిల్‌లో డెఫ్‌లింపిక్స్‌ను ముగించుకుని భారత్‌కు చేరుకున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన అధికారిక నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ క్రీడల్లో మన అథ్లెట్లు 16 పతకాలతో దేశాన్ని టాప్‌-10లో నిలిపారు. డెఫ్‌లింపిక్స్‌

Published : 22 May 2022 04:03 IST

దిల్లీ: బ్రెజిల్‌లో డెఫ్‌లింపిక్స్‌ను ముగించుకుని భారత్‌కు చేరుకున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన అధికారిక నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ క్రీడల్లో మన అథ్లెట్లు 16 పతకాలతో దేశాన్ని టాప్‌-10లో నిలిపారు. డెఫ్‌లింపిక్స్‌ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ నేపథ్యంలో ప్రధాని భారత అథ్లెట్లను తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ‘‘డెఫ్‌లింపిక్స్‌లో చక్కటి ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసిన మన ఛాంపియన్లతో జరిపిన సంభాషణను నేనెప్పటికీ మరిచిపోలేను. అథ్లెట్లు వారి అనుభవాలను నాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి పట్టుదల, క్రీడల పట్ల వారి ఉత్సాహం ఎలాంటిదో తెలిసింది. వారికి నా అభినందనలు’’ అని ట్విటర్లో మోదీ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని