ఆనంద్‌కు సూపర్‌బెట్‌ టైటిల్‌

ప్రపంచ మాజీ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ పోలెండ్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Updated : 22 May 2022 06:31 IST

వార్సా: ప్రపంచ మాజీ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ పోలెండ్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే అతడు విజేతగా నిలిచాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఆనంద్‌.. రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు. అతడు ఏడో రౌండ్లో 25 ఎత్తుల్లో డేవిడ్‌ గవ్రిలెస్కు (రొమేనియా)పై విజయం సాధించాడు. కరౌనా (అమెరికా)తో జరిగిన తర్వాతి గేమ్‌ను 27 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. ర్యాపిడ్‌లో తొమ్మిది రౌండ్లు ముగిశాక ఆటగాళ్లు బ్లిట్జ్‌ ఈవెంట్లో పోటీపడతారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని