వద్దనుకునే వదిలేశాం

ముంబయితో మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు బంతి తాకలేదని సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్నవాళ్లు చెప్పడంతోనే సమీక్షకు వెళ్లకుండా ఆగిపోయానని చెప్పాడు దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌.

Published : 23 May 2022 02:07 IST

ముంబయి: ముంబయితో మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు బంతి తాకలేదని సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్నవాళ్లు చెప్పడంతోనే సమీక్షకు వెళ్లకుండా ఆగిపోయానని చెప్పాడు దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌. ‘‘మొదట బంతి డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు తాకినట్లు అనిపించింది. సమీక్షకు వెళ్లాలా అని సమీపంలో ఫీల్డర్లను అడిగాను. కానీ వాళ్లెవరూ సముఖత చూపించలేదు. అందుకే రివ్యూ తీసుకోలేదు’’ అని రిషబ్‌ సమీక్షకు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ బ్యాట్‌కు బంతి తగిలే సమయానికి ముంబయి 33 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బంతి తాకినట్లు మైదానంలో అంపైర్‌ తపన్‌శర్మ గుర్తించలేకపోయాడు. దిల్లీ కెప్టెన్‌ పంత్‌ కూడా సమీక్ష తీసుకోలేదు. కానీ ఈ తప్పే దిల్లీని ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా అడ్డుకుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డేవిడ్‌.. ఆ తర్వాత 10 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు