ముగురుజకు షాక్
ఎర్ర మట్టి గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. మాజీ ఛాంపియన్ ముగురుజ (స్పెయిన్), రెండుసార్లు ఫైనలిస్ట్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు.
థీమ్ ఇంటికి
సకారి, స్టీఫెన్స్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఎర్ర మట్టి గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. మాజీ ఛాంపియన్ ముగురుజ (స్పెయిన్), రెండుసార్లు ఫైనలిస్ట్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఆదివారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్ ముగురుజ 6-2, 3-6, 4-6తో 37 ఏళ్ల కయా కనేపి (ఇస్తోనియా) చేతిలో ఓడింది. తొలి సెట్ గెలిచి జోరు మీద కనిపించిన ముగురుజ.. ఆ తర్వాత తడబడింది. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈసారి మహిళల సింగిల్స్‌లో పోటీపడుతున్న పెద్ద వయస్కురాలైన కనేపి ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించడమే కాక.. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. ఆరో సీడ్ జబెర్ (ట్యూనీసియా) కూడా ఓడిపోయింది. ఆమె 6-3, 6-7 (7/4), 5-7 లినెట్ (పోలెండ్) చేతిలో పరాజయం చవిచూసింది. నాలుగో సీడ్ సకారి (గ్రీస్), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) ముందంజ వేశారు. సకారి 6-2, 6-3తో బరెల్ (ఫ్రాన్స్)పై గెలవగా, స్లోన్ స్టీఫెన్స్ 5-7, 6-4, 6-2తో నిమియర్ (జర్మనీ)ని ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో డొమినిక్ థీమ్ కథ ముగిసింది. తొలి రౌండ్లో థీమ్ 3-6, 2-6, 4-6తో వరుస సెట్లలో డెలియన్ (బొలీవియా) చేతిలో కంగుతిన్నాడు. దిమిత్రోవ్ (బల్గేరియా), ఇస్నర్ (అమెరికా), ఫాగ్నిని (ఇటలీ), ష్వార్జ్‌మ్యాన్ (అర్జెంటీనా) తొలి రౌండ్ అధిగమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?