
Harmapreet Kaur: పూజ విజృంభణ.. స్మృతి మంధాన జట్టుపై హర్మన్‌ప్రీత్ సేన గెలుపు
మహిళల టీ20 ఛాలెంజ్
పుణె: భారత టీ20 లీగ్ తరహాలో మహిళల కోసం నిర్వహిస్తున్న టీ20 ఛాలెంజ్ టోర్నమెంట్లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఆ జట్టు 49 పరుగుల తేడాతో స్మృతి మంధాన టీమ్‌ను ఓడించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంధాన జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులే చేయగలిగింది. ఆల్‌రౌండర్ పూజ వస్త్రాకర్ (4/12) వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలు చేసింది. సోఫీ ఎకిల్‌స్టోన్ (2/19), అలానా కింగ్ (2/30), మేఘన సింగ్ (1/16) కూడా దెబ్బ తీశారు. ఛేదనలో ఓపెనర్లు స్మృతి మంధాన (34; 23 బంతుల్లో 4×4), హేలీ మాథ్యూస్ (18; 14 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆరంభించినా.. తొలి వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. మొదట హేలీని ఔట్ చేసిన పూజ.. ఒకే ఓవర్లో స్మృతి, డంక్లీ (1)లను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థిని కోలుకోలేకుండా చేసింది. ఆ తర్వాత సోఫీ, అలానా అద్భుతంగా బౌలింగ్ చేశారు. రోడ్రిగ్స్ (24), రేణుక (14 నాటౌట్) పోరాడడంతో మంధాన టీమ్ వంద పరుగులు దాటి, కాస్త గౌరవప్రదంగా ఓడింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హర్మన్ (37; 29 బంతుల్లో 4×4), హర్లీన్ డియోల్ (35; 19 బంతుల్లో 5×4), డాటిన్ (32; 17 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించడంతో ఆమె జట్టు 163 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో హేలీ మాథ్యూస్ (3/29), సల్మా ఖాతూన్ (2/30) సత్తా చాటారు. డాటిన్ మెరుపులతో 5 ఓవర్లలోనే 50 పరుగులు చేసి.. హర్లీన్ దూకుడుతో 12వ ఓవర్లోనే 100 దాటిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఇంకా పెద్ద స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో మోస్తరు స్కోరుకు పరిమితమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: నేనేం మాట్లాడినా పార్టీ కోసమే.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా: జగ్గారెడ్డి
-
Sports News
IND vs ENG: వికెట్లు కోల్పోతున్న టీమ్ఇండియా.. పంత్ కూడా ఔట్
-
India News
PM Modi: భీమవరంలో ఆ వీర దంపతుల కుమార్తెకు ప్రధాని మోదీ పాదాభివందనం
-
Business News
Stock Market Update: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Movies News
Rajinikanth: వాళ్లతో సమానమని మాధవన్ నిరూపించుకున్నాడు: రజనీకాంత్
-
General News
Andhra News: మోదీ పర్యటనలో నల్ల బెలూన్లతో నిరసన.. పలువురి అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!