Published : 24 May 2022 03:38 IST

బంగ్లాదేశ్‌ 277/5

ఢాకా: మ్యాచ్‌ ఇలా ఆరంభమైందో లేదో అలా వికెట్లు టపటపా పడ్డాయి. ఏడు ఓవర్లలో 24 పరుగులకే అయిదు వికెట్లు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు, సోమవారం ఆతిథ్య బంగ్లాదేశ్‌ పరిస్థితిది. లంక పేసర్ల ధాటికి వణికిపోయిన బంగ్లా కుప్పకూలడం ఖాయమని, ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పనైపోయినట్లేనని అనుకున్నారంతా! ఫాస్ట్‌ బౌలర్లు కసున్‌ రజిత (3/43), అసిత ఫెర్నాండో (2/80) ధాటికి బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కానీ అద్భుతమే జరిగింది. లంక 277/5తో మొదటి రోజు మెరుగ్గా తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కారణం ముష్ఫికర్‌ రహీమ్‌ (115 బ్యాటింగ్‌; 252 బంతుల్లో 13×4), లిటన్‌ దాస్‌ (135 బ్యాటింగ్‌; 221 బంతుల్లో 16×4, 1×6) పోరాటం. పట్టుదలగా నిలిచిన ఈ జంట, చక్కని బ్యాటింగ్‌తో అభేద్యమైన ఆరో వికెట్‌కు 253 పరుగులు జోడించి బంగ్లాను కాపాడింది.

ఆసుపత్రికి మెండిస్‌: తొలి రోజు ఆట సందర్భంగా శ్రీలంక బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. లంచ్‌కు ముందు చివరి ఓవర్లో అసౌకర్యానికి గురైనట్లు కనిపించిన మెండిస్‌.. మైదానంలో పడుకున్నాడు. వెంటనే లంక జట్టు వైద్యులు అతణ్ని పరీక్షించడానికి వచ్చారు. ఆ తర్వాత అతడు ఛాతీని పట్టుకుంటూ మైదానాన్ని వీడాడు. తర్వాత మెండిస్‌ను ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అతడికి ప్రమాదమేమీ లేదని తేలింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని