
ఒసాకాకు షాక్
తొలి రౌండ్లోనే పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వైటెక్, నాదల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం. మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాకా కథ తొలి రౌండ్లోనే ముగిసింది. అమందా అనిసిమోవా ఆమెకు షాకిచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ క్రెజికోవా కూడా నిష్క్రమించగా.. టాప్ సీడ్ స్వైటెక్ శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఫేవరెట్ రఫెల్ నాదల్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
పారిస్
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నవోమి ఒసాకా (జపాన్) ఔట్. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అనిసిమోవా (అమెరికా) 7-5, 6-4తో ఒసాకాపై విజయం సాధించింది. మ్యాచ్‌లో అనిసిమోవా అయిదు ఏస్‌లు కొట్టింది. సర్వీసులో తడబడ్డ ఒసాకా ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకుంది. ఆమె 29 అనవసర తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్ తొలి సెట్ తొలి ఆరు గేముల్లో నాలుగు సార్లు సర్వీసులు బ్రేకయ్యాయి. 11వ గేమ్‌లో ఒసాకా డబుల్ ఫాల్ట్‌తో బ్రేక్ సాధించిన అనిసిమోవా 6-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుని సెట్‌ను గెలుచుకుంది. అనిసిమోవా రెండో సెట్లో ఏడో గేమ్‌లో బ్రేక్ సాధించడం ద్వారా పైచేయి సాధించింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ బార్బరా క్రెజికోవా (చెక్)కు కూడా మొదటి రౌండ్ దాటలేకపోయింది. ఫ్రాన్స్‌కు చెందిన డయాన్ పెర్రీ 6-4, 6-2తో ఆమెకు షాకిచ్చింది. ప్రపంచ నంబర్‌వన్ స్వైటెక్ (పోలెండ్), మాజీ నంబర్‌వన్ అజరెంక (బెలారస్) శుభారంభం చేశారు. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటెక్ తొలి రౌండ్లో 6-2, 6-0తో సురెంకో (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది.. అజరెంక 6-7 (7-9), 7-6 (7-1), 6-2తో బొగ్దాన్ (రొమేనియా)ను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పెట్కోవిచ్ (జర్మనీ) 6-4, 6-2తో దొడిన్ (ఫ్రాన్స్)పై, క్విటోవా (చెక్) 7-6 (7-0), 6-1తో అనా బొండార్ (హంగేరి)పై, రిస్కే (అమెరికా) 6-3, 6-3తో యస్త్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, జెంగ్ (చైనా) 6-3, 6-1తో జనెవ్స్కా (బెల్జియం)పై విజయం సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో 13 సార్లు ఛాంపియన్, అయిదో సీడ్ రఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అతడు 6-2, 6-2, 6-2తో ధాంప్సన్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా విజయం సాధించాడు. థాంప్సన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. మ్యాచ్‌లో అతడి సర్వీసును నాదల్ ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నాదల్ 27 విన్నర్లు కొట్టాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 3-6, 6-7 (2-7), 3-6తో మౌటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. పదో సీడ్ నోరీ (బ్రిటన్) 7-5, 6-2, 6-0తో గినార్డ్ (ఫ్రాన్స్)ను ఓడించి రెండో రౌండ్లో ప్రవేశించాడు. ఫ్రిట్జ్ (అమెరికా), క్రజనోవిచ్ (సెర్బియా), ఎవాన్స్ (బ్రిటన్), మెక్‌డొనాల్డ్ (అమెరికా) కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: విభజన వల్ల దెబ్బతిన్నాం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి: మోదీకి జగన్ వినతి
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా రెండో 245 ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 378
-
Business News
GST Rate: 28% శాతం మున్ముందూ తప్పదు.. జీఎస్టీ పరిధిలోకి ‘చమురు’.. వేచి చూడాల్సిందే!
-
India News
Eknath Shinde: చనిపోయిన పిల్లలను గుర్తుచేసుకుని.. కన్నీళ్లు పెట్టుకున్న శిందే
-
Sports News
Rishabh Pant: ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పంత్
-
Movies News
God Father: ‘గాడ్ ఫాదర్’ ఆగయా.. లుక్‌తోనే అంచనాలు పెంచుతున్న చిరు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు