Published : 24 May 2022 03:38 IST

ఈడెన్‌ కాదు మొతెరా నా సొంతగడ్డ

కోల్‌కతా: దేశవాళీ కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మొతెరా స్టేడియం తన సొంతగడ్డ అంటూ ప్రకటించాడు. బంగాల్‌ రంజీ జట్టు పట్ల క్యాబ్‌ అధికారి ఒకరు తన నిబద్ధతను ప్రశ్నించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సాహా ఆ రాష్ట్ర క్రికెట్‌ను వీడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈడెన్‌ తన సొంతగడ్డ కాదంటూ వ్యాఖ్యానించాడు. 2007లో ఈడెన్‌ గార్డెన్స్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రంజీ ట్రోఫీలో బంగాల్‌ తరఫున అరంగేట్రం చేసిన సాహా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ‘ టీ2ఏ లీగ్‌లో నేను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నా. కాబట్టి నా సొంత మైదానం మొతెరా స్టేడియమని నమ్ముతున్నా. కోల్‌కతాకు ఆడట్లేదు కాబట్టి ఈడెన్‌ నా సొంతగడ్డ కాదు’’ అని సాహా తెలిపాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని