
ఆనంద్‌కు రెండో స్థానం
వార్సా: సూపర్‌బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్లో విశ్వనాథన్ ఆనంద్ మొత్తంగా రెండో స్థానంలో నిలిచాడు. బ్లిట్జ్ పోటీల రెండో రోజు అతడు మూడు గేముల్లో నెగ్గి.. మూడు గేముల్లో ఓడిపోయాడు. మరో మూడింటిని డ్రాగా ముగించాడు. పోలెండ్‌కు చెందిన దుడా మొత్తం 24 పాయింట్లతో టోర్నీ ఓవరాల్ విజేతగా నిలవగా.. 23.5 పాయింట్లతో ఆనంద్, అరోనియన్ సంయుక్తంగా రెండో స్థానం సాధించారు. ఆనంద్ ఈ టోర్నీలో ఇంతకుముందు ర్యాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
క్వార్టర్స్‌లో ప్రజ్ఞానంద
చెన్నై: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చెసబుల్ మాస్టర్స్ 2022 ఆన్లైన్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిలిమనరీస్లో చివరిదైన 15వ రౌండ్లో అతడు విదిత్ గుజరాతీపై విజయం సాధించాడు. ఆరో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద మొత్తం 25 పాయింట్లతో.. అనిష్ గిరి (29), కార్ల్సన్ (28), దింగ్ లిరెన్ (చైనా) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. క్వార్టర్స్‌లో అతడు చైనాకు చెందిన వీ యి తో తలపడతాడు. మరో ఇద్దరు భారతీయులు హరికృష్ణ, విదిత్ నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. హరికృష్ణ 18 పాయింట్లతో 9వ స్థానంలో నిలవగా.. విదిత్ 17 పాయింట్లు సాధించి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
రిజర్వ్ డే ఫైనల్‌కు మాత్రమే
దిల్లీ: టీ 20 లీగ్ ప్లేఆఫ్ దశలో ఏ మ్యాచ్ అయినా వర్షం, ఇతర కారణాల వల్ల పూర్తి కాని పక్షంలో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. ఈ మేరకు ప్లేఆఫ్స్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సూపర్ ఓవర్ కూడా నిర్వహించడం సాధ్యం కాకపోతే రెండు జట్లలో లీగ్ దశలో ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టు ముందంజ వేస్తుంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లకు ఇదే నిబంధన వర్తిస్తుంది. వీటికి రిజర్వ్ డేలు లేవు. ఈ నెల 29న జరగాల్సిన ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంది. ఆ రోజు మ్యాచ్ సాధ్యం కాకపోతే 30న రాత్రి 8 గంటల నుంచి నిర్వహిస్తారు. ఈ సీజన్లో రాత్రి మ్యాచ్‌లన్నీ 7.30కి మొదలవుతున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chirag Paswan: మరో ‘శిందే’ కోసం భాజపా, జేడీయూల వెతుకులాట..!
-
Business News
Amazon primeday sale: ప్రైమ్ యూజర్లూ అలర్ట్.. ప్రైమ్ డే సేల్ ఈ సారి ముందుగానే!
-
Politics News
Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు
-
Movies News
Sini Shetty: ఇప్పటి మిస్ ఇండియా ఒకప్పటి ఎయిర్టెల్ భామనే
-
Sports News
Bairstow: కోహ్లీతో గొడవ.. బెయిర్‌స్టో ఏమన్నాడంటే..?
-
Politics News
Maharashtra: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్ సంచలన వ్యాఖ్యలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్