ఇంటికెవరు.. ముందుకెవరు?
టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరానికి వేళైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ బెంగళూరు జట్టు లఖ్‌నవూను ఢీకొంటుంది. గత మ్యాచ్‌తో కోహ్లి ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు పెద్ద
బెంగళూరు × లఖ్‌నవూ ఎలిమినేటర్ నేడు
రాత్రి 7.30 నుంచి
కోల్‌కతా
టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరానికి వేళైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ బెంగళూరు జట్టు లఖ్‌నవూను ఢీకొంటుంది. గత మ్యాచ్‌తో కోహ్లి ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు పెద్ద సానుకూలాంశం. గుజరాత్‌పై అతడు 54 బంతుల్లో 73 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా రాణిస్తుండడం, హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండడం, డుప్లెసిస్ చక్కని కెప్టెన్సీ.. తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోన్న బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. హసరంగ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ కూడా ఆ జట్టుకు ఉన్నాడు. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్ చేరినా.. ఆ జట్టు ఒక్కసారి కూడా నెగ్గని సంగతి తెలిసిందే. కానీ మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై జట్టులో సభ్యుడిగా ఉండి, ఈ సీజన్‌కు ఆర్సీబీకి మారిన డుప్లెసిస్ నాయకత్వంలో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. మరోవైపు తొలిసారి ఐపీఎల్లో బరిలోకి దిగినా.. రాహుల్ నేతృత్వంలో లఖ్‌నవూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు రాహుల్, డికాక్‌లను నిలువరించడం బెంగళూరుకు పెద్ద సవాలే. ఈ సీజన్లో బహుశా అత్యుత్తమ ఓపెనింగ్ జంట వీళ్లే. లఖ్‌నవూ అతి పెద్ద బలం రాహుల్, డికాక్లే. ఇప్పటివరకు వీళ్లిద్దరు కలిసి 1039 పరుగులు చేయడం విశేషం. కోల్‌కతాపై తొలి వికెట్‌కు ఏకంగా 210 పరుగులు జోడించి రికార్డు సృష్టించారు. అయితే నాణ్యమైన మిడిల్ ఆర్డర్ లేకపోవడం లఖ్‌నవూకు ప్రతికూలంశం. దీపక్ హుడా మినహా మిడిల్ ఆర్డర్లో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. లోయర్ ఆర్డర్లో కూడా అంతే. క్వార్టర్ ఫైనల్ లాంటి ఈ మ్యాచ్‌లో స్టాయినిస్, కృనాల్, బదోని, హోల్డర్ వంటి వారు చెలరేగడం లఖ్‌నవూకు ఎంతో అవసరం. పేస్ బౌలర్ మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో ఆ జట్టుకు పెద్ద బలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Pakistan: పొరుగు దేశంపై పాక్ వైమానిక దాడి.. ఎనిమిది మంది మృతి
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
-
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
-
Ashwin: బెన్‌స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: రవిచంద్రన్ అశ్విన్