మెద్వెదెవ్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో సీడ్ డానియల్ మెద్వెదెవ్ ముందంజ వేశాడు. ఈ రష్యా ఆటగాడు పెద్దగా కష్టపడకుండానే రెండో రౌండ్ చేరాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మెద్వెదెవ్ 2-6, 2-6, 2-6తో
రెండో రౌండ్లోకి జకో, ప్లిస్కోవా
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్
ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో సీడ్ డానియల్ మెద్వెదెవ్ ముందంజ వేశాడు. ఈ రష్యా ఆటగాడు పెద్దగా కష్టపడకుండానే రెండో రౌండ్ చేరాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మెద్వెదెవ్ 2-6, 2-6, 2-6తో బాగ్నిస్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి మెద్వెదెవ్‌దే హవా. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన ఈ రష్యా స్టార్.. ఆ తర్వాత 5, 7 గేముల్లో మరోసారి బ్రేక్ సాధించి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండు, మూడు సెట్లలోనూ మెద్వెదెవ్ దూకుడు ముందు అన్‌సీడెడ్ బాగ్నిస్ నిలువలేకపోయాడు. రెండు సెట్లలో అయిదుసార్లు సర్వీస్ కోల్పోయి ఓటమి చవిచూశాడు. టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) కూడా శుభారంభం చేశాడు. అతడు 6-3, 6-1, 6-0తో నిషోకా (జపాన్)ను చిత్తు చేశాడు. తొలి సెట్లో తప్ప జకోకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనే ఎదురు కాలేదు. సోంగా (ఫ్రాన్స్) ఓడిపోయాడు. తొలి రౌండ్లో అతడు 7-6 (8/6), 6-7 (4/7), 2-6, 6-7 (0/7)తో రూడ్ (నార్వే) చేతిలో పరాజయం చవిచూశాడు. ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), కొర్డా (అమెరికా), గోఫిన్ (బెల్జియం) తొలి రౌండ్ అధిగమించారు.
ప్లిస్కోవా తడబడినా..: మహిళల సింగిల్స్ ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) తడబడినా ముందంజ వేసింది. ఆమె 2-6, 6-3, 6-1తో ఆండ్రియానా (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. తొలి సెట్లో మూడుసార్లు ప్లిస్కోవా సర్వీస్ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్న అండ్రియానా.. రెండో సెట్లో ఆరంభంలోనూ ప్లిస్కోవాపై ఆధిపత్యం చూపించింది. కానీ ఆ తర్వాత ప్లిస్కోవా బలంగా పుంజుకుంది. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ సాధించి ఆపై సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌లో నిలిచింది. ఈ సెట్ దక్కిన ఉత్సాహంతో మూడో సెట్లో చెలరేగిన ప్లిస్కోవా ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో సీడ్ బదోసా (స్పెయిన్), ఒస్టాపెంకో (లాత్వియా), మాడిసన్ కీస్ (అమెరికా) ముందంజ వేశారు. బదోసా 6-2, 6-0తో ఫెరో (బెల్జియం)పై, ఒస్టాపెంకో 6-1, 6-4తో బ్రొంజెటిపై (ఇటలీ)పై, కీస్ 6-3, 3-6, 6-4తో కలిన్స్కయా (రష్యా)పై నెగ్గారు.
బోపన్న జోడీ శుభారంభం: పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-మ్యాట్ మిడిల్‌కాప్ (నెదర్లాండ్స్) జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-మిడిల్‌కాప్ 6-4, 6-1తో వైల్డ్‌కార్డ్ జంట సాచా గెమార్డ్-లుకావాన్ (స్పెయిన్)పై విజయం సాధించింది. డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-హంటర్ రీస్ (అమెరికా)తో కలిసి బరిలో ఉన్నాడు. రామ్‌కుమార్ జంట.. తొలి రౌండ్లో ఆల్ట్మెయిర్-ఆస్కార్ (జర్మనీ)తో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా-లూసీ హెడ్రెకా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లో జాస్మిన్-ట్రెవిసాన్ (ఇటలీ)తో పోటీపడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై