హర్మన్ పోరాడినా.. దీప్తిశర్మ జట్టుదే విజయం
హర్మన్‌ప్రీత్ కౌర్ (71; 51 బంతుల్లో 7×4, 3×6) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించింది. కానీ ఆమె శ్రమ వృథానే
మెరిసిన షెఫాలి, లారా
పుణె
హర్మన్‌ప్రీత్ కౌర్ (71; 51 బంతుల్లో 7×4, 3×6) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించింది. కానీ ఆమె శ్రమ వృథానే అయింది. మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో స్మృతి మంధాన(ట్రయల్బ్రేజర్స్)ను ఓడించి టోర్నీలో శుభారంభం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (సూపర్నోవాస్).. రెండో మ్యాచ్‌లో వెలాసిటీ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట హర్మన్‌కు తోడు తానియా భాటియా (36; 32 బంతుల్లో 3×4) కూడా రాణించడంతో సూపర్నోవాస్ 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో ఆకట్టుకున్న డాటిన్ (6), ప్రియ పూనియా (4), హర్లీన్ (7) విఫలమవడంతో 18/3తో కష్టాల్లో పడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్ (సూపర్నోవాస్)ను హర్మన్, తానియా ఆదుకున్నారు. హర్మన్ చివరిదాకా క్రీజులో నిలిచి జట్టుకు మంచి స్కోరును సాధించి పెట్టింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్ (2/24), రాధ యాదవ్ (1/22), దీప్తి శర్మ (1/31) రాణించారు. అనంతరం ఛేదనలో తొలి ఓవర్లోనే నాట్టకన్ (1) వికెట్ కోల్పోయిన దీప్తిశర్మ (వెలాసిటీ)ని షెఫాలి వర్మ (51; 33 బంతుల్లో 9×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించింది. ఆమెకు యాస్తిక (17) అండగా నిలిచింది. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా మెరుపు షాట్లతో విరుచుకుపడ్డ షెఫాలి ధాటికి దీప్తిశర్మ(వెలాసిటీ) 5.2 ఓవర్లలోనే 50 దాటింది. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన షెఫాలి పదో ఓవర్లో హర్మన్‌ప్రీత్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు నిష్క్రమించింది. అప్పటికే స్కోరు 80కి చేరుకుంది. షెఫాలితో పాటు యాస్తికను డాటిన్ (2/21) పెవిలియన్ చేర్చింది. ఈ స్థితిలో లారా వోల్వార్ట్ (51 నాటౌట్; 35 బంతుల్లో 7×4, 1×6), దీప్తి శర్మ (24 నాటౌట్; 25 బంతుల్లో 2×4) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. వెలాసిటీ 18.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గురువారం వెలాసిటీ, ట్రయల్‌బ్లేజర్స్ తలపడతాయి.
హర్మన్‌ప్రీత్ కౌర్ (సూపర్నోవాస్): 150/5 (హర్మన్‌ప్రీత్ 71, తానియా భాటియా 36; కేట్ క్రాస్ 2/24, రాధ యాదవ్ 1/22)
దీప్తిశర్మ (వెలాసిటీ): 151/3 (షెఫాలి 51, లారా వోల్వారల్ట్ 51 నాటౌట్, దీప్తి శర్మ 24 నాటౌట్; డాటిన్ (2/21)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్