సెమీస్‌లో ప్రజ్ఞానంద
మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ప్రజ్ఞానంద 2.5-1.5తో వీయ్ యీ (చైనా)పై విజయం
చెన్నై: మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ప్రజ్ఞానంద 2.5-1.5తో వీయ్ యీ (చైనా)పై విజయం సాధించాడు. రెండు గేమ్‌ల ఈ సమరంలో నల్ల పావులతో ఆడిన భారత టీనేజర్... తొలి గేమ్‌లో 90 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించాడు. రెండో గేమ్‌లోనూ అదే జోరుతో గెలిచి 2-0తో విజయాన్ని అందుకున్నాడు. సెమీస్‌లో 16 ఏళ్ల ప్రజ్ఞానంద.. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో తలపడనున్నాడు. సెమీస్ చేరే క్రమంలో ప్రజ్ఞానంద.. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను కూడా ఓడించాడు. మరో సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్.. డింగ్ లీరెన్ (చైనా)తో పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో పోటీపడిన మరో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతి తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్