Published : 25 May 2022 03:40 IST

నాకౌట్‌ అవకాశాలకు దెబ్బ

జపాన్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఆసియాకప్‌ హాకీ

జకార్తా: ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌ నాకౌట్‌ అవకాశాలకు దెబ్బ తగిలింది. దాదాపు అంతా జూనియర్‌ ఆటగాళ్లతో ఆడుతున్న మన జట్టు.. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ రెండో మ్యాచ్‌లో 2-5తో జపాన్‌ చేతిలో కంగుతింది. పాకిస్థాన్‌తో గెలిచే మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్‌.. జపాన్‌ చేతిలో ఓడడంతో.. ఇండోనేషియాపై చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచినా నాకౌట్‌కు అర్హత సాధించడం అనుమానమే. జపాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఆరంభంలోనే ఒత్తిడిలో పడిపోయింది. భారత్‌ డిఫెన్స్‌లో లోపాలను సద్వినియోగం చేసుకుంటూ దూకుడుగా ఆడిన జపాన్‌ 23వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ (నగయోషి) గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత కొసెయ్‌ (39వ ని), రిమా (48వ ని) గోల్స్‌ చేసి జపాన్‌కు 3-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే నాలుగో క్వార్టర్‌లో భారత్‌ పుంజుకుంది. తక్కువ వ్యవధిలో రాజ్‌బర్‌ పవన్‌  (44వ ని), ఉత్తమ్‌సింగ్‌ (49వ ని) చేసిన గోల్స్‌తో  2-3తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ భారత్‌ ఆనందం కాసేపే. కోజి (54వ ని), కొసెయ్‌ (55వ ని) కొట్టిన గోల్స్‌తో జపాన్‌ 5-2తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్‌ గోల్స్‌ కోసం ఎంతగా పోరాడినా జపాన్‌ డిఫెన్స్‌ చేధించడంలో విఫలమైంది. దీంతో రెండు మ్యాచ్‌ల నుంచి ఒక పాయింట్‌తో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. పూల్‌-ఎలో జపాన్‌ (6), పాకిస్థాన్‌ (4) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.


ముష్ఫికర్‌ 175.. బంగ్లా 365

ఢాకా: శ్రీలంకతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 277/5తో రెండో రోజు, మంగళవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఆ జట్టు.. ఇంకో 188 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. 24/5తో తొలి రోజు పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సెంచరీలతో ఆదుకున్న ముష్ఫికర్‌ (175; 355 బంతుల్లో 22×4), లిటన్‌  దాస్‌ (141; 246 బంతుల్లో 16×4, 1×6) ఆరో వికెట్‌కు 272 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో రజిత (5/64), అసిత ఫెర్నాండో (4/93) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంక.. ఆట ఆఖరుకు 143/2తో నిలిచింది. ఒషాడో ఫెర్నాండో (57), కుశాల్‌ మెండిస్‌ (11) ఔటయ్యారు. కరుణరత్నె (70), రజిత (0) క్రీజులో ఉన్నారు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని