టాప్‌-10లోనే కోహ్లి, రోహిత్‌

ఐసీసీ పురుషుల టెస్టు బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ, మాజీ సారథి విరాట్‌ కోహ్లి టాప్‌-10లో కొనసాగుతున్నారు.

Published : 26 May 2022 02:11 IST

దుబాయ్‌: ఐసీసీ పురుషుల టెస్టు బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ, మాజీ సారథి విరాట్‌ కోహ్లి టాప్‌-10లో కొనసాగుతున్నారు. బుధవారం ప్రకటించిన జాబితాలో రోహిత్‌ 8వ, కోహ్లి పదో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 2వ, బుమ్రా మూడో స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా నంబర్‌వన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని