అప్పుడే విజయం సంపూర్ణం

2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు స్టార్‌ క్రీడాకారిణి మేరీ కోమ్‌.. వర్ధమాన ప్లేయర్‌ నిఖత్‌ జరీన్‌ల మధ్య వివాదం అందరికీ తెలిసిందే. సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్‌ ట్రయల్స్‌కు ఎలా పంపిస్తారని నిఖత్‌ ప్రశ్నించడం

Published : 26 May 2022 02:12 IST

దిల్లీ: 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు స్టార్‌ క్రీడాకారిణి మేరీ కోమ్‌.. వర్ధమాన ప్లేయర్‌ నిఖత్‌ జరీన్‌ల మధ్య వివాదం అందరికీ తెలిసిందే. సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్‌ ట్రయల్స్‌కు ఎలా పంపిస్తారని నిఖత్‌ ప్రశ్నించడం అప్పట్లో మేరీకి ఆగ్రహం తెప్పించింది. చివరికి నిర్వహించిన ట్రయల్స్‌లో గెలిచిన మేరీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే బౌట్‌ అనంతరం నిఖత్‌తో కరచాలనానికి మేరీ విముఖత చూపింది. ‘‘నేను ఎందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి? ఆమెకు గౌరవం కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది కూడా. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ను మాజీ ఛాంపియన్‌ మేరీ ట్విటర్‌ వేదికగా అభినందించడం వైరల్‌గా మారింది. ‘‘బంగారు పతకం సాధించినందుకు అభినందనలు. నీ చరిత్రత్మాక ప్రదర్శన పట్ల ఎంతో గర్వంగా ఉన్నా. భవిష్యత్తులో అపూర్వ విజయాలు సాధించాలి’’ అని నిఖత్‌ను విజేతగా ప్రకటించినప్పటి ఫొటోను మేరీ ట్వీట్‌ చేసింది. దీనికి బదులుగా ‘‘మీ అభిమాన క్రీడాకారిణి ఆశీర్వాదం లేకుండా ఏ విజయం సంపూర్ణం కాదు’’ అంటూ మేరీతో కలిసి ఉన్న ఫొటోను నిఖత్‌ పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని