మాథ్యూస్‌, చండిమాల్‌ శతకాలు

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 282/5తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన శ్రీలంక 165.1 ఓవర్లలో 506 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్‌ (145 నాటౌట్‌; 342 బంతుల్లో 12×4, 2×6), దినేశ్‌ చండిమాల్‌ (124; 219 బంతుల్లో 11×4, 1×6) సెంచరీలతో కదంతొక్కడంతో

Published : 27 May 2022 02:56 IST

ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 282/5తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన శ్రీలంక 165.1 ఓవర్లలో 506 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్‌ (145 నాటౌట్‌; 342 బంతుల్లో 12×4, 2×6), దినేశ్‌ చండిమాల్‌ (124; 219 బంతుల్లో 11×4, 1×6) సెంచరీలతో కదంతొక్కడంతో శ్రీలంక 141 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. మాథ్యూస్‌, చండిమాల్‌ ఆరో వికెట్‌కు 199 పరుగులు జోడించి శ్రీలంక భారీస్కోరుకు బాటలు వేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 4 వికెట్లకు 34 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 107 పరుగులు రాబట్టాలి. ముష్ఫికర్‌ రహీం (14 బ్యాటింగ్‌), లిటన్‌ దాస్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు