జ్యోతి మళ్లీ రికార్డు పరుగు

రెండు వారాల్లో మూడుసార్లు జాతీయ రికార్డు బద్దలు. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి సత్తా ఇది. 100 మీటర్ల హర్డిల్స్‌లో సంచలన అథ్లెట్‌గా ఎదిగిన జ్యోతి మరోసారి జాతీయ రికార్డును సవరించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న డీ హ్యారీ షట్లింగ్‌ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌ పరుగును 13.04 సెకన్లలో పూర్తి చేసిన

Published : 27 May 2022 02:56 IST

దిల్లీ: రెండు వారాల్లో మూడుసార్లు జాతీయ రికార్డు బద్దలు. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి సత్తా ఇది. 100 మీటర్ల హర్డిల్స్‌లో సంచలన అథ్లెట్‌గా ఎదిగిన జ్యోతి మరోసారి జాతీయ రికార్డును సవరించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న డీ హ్యారీ షట్లింగ్‌ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌ పరుగును 13.04 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి తన పేరిటే ఉన్న రికార్డు (13.11 సె)ను అధిగమించింది. అంతకుముందు సైప్రస్‌ టోర్నీలో 13.23 సెకన్లలో రేసు ముగించి.. అనురాధ బిస్వాల్‌ (13.38 సె; 2002లో) పేరిట ఉన్న రికార్డును జ్యోతి బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని