ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా లవ్లీనా

ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్‌.. ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా, ఓటింగ్‌ సభ్యురాలిగా ఎన్నికైంది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) గురువారం ఈ విషయం తెలిపింది. ఎన్నికల్లో లవ్లీనాకు అత్యధిక ఓట్లు వచ్చాయి. ‘‘ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా.

Published : 27 May 2022 02:56 IST

దిల్లీ: ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్‌.. ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా, ఓటింగ్‌ సభ్యురాలిగా ఎన్నికైంది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) గురువారం ఈ విషయం తెలిపింది. ఎన్నికల్లో లవ్లీనాకు అత్యధిక ఓట్లు వచ్చాయి. ‘‘ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. సభ్యురాలిని అవుతాననుకున్నా కానీ.. ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవుతానని ఊహించలేదు. భారత బాక్సింగ్‌ను, ముఖ్యంగా మహిళల బాక్సింగ్‌ను వ్యాప్తి చేయడానికి నాకిది ఉపయోగపడుతుంది’’ అని లవ్లీనా ఓ ప్రకటనలో చెప్పింది. మరో భారత బాక్సర్‌ శివ్‌ థాపా కూడా ఐబీఎ అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2022 మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డ బాక్సర్లు లవ్లీనాను, 2021 పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డ బాక్సర్లు థాపాను ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని