క్రెజికోవాకు కరోనా

గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్లో సింగిల్స్‌, డబుల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన బార్బారా క్రెజికోవా కరోనా బారిన పడింది. తాజా పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో తాను టోర్నీ నుంచి వైదొలిగినట్లు ఆమె తెలిపింది. ‘‘గత రాత్రి నుంచి ఆరోగ్యం బాగాలేదు. ఉదయం లేవగానే జ్వరం ఉన్నట్లు అర్థమైంది

Updated : 27 May 2022 04:10 IST

పారిస్‌: గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్లో సింగిల్స్‌, డబుల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన బార్బారా క్రెజికోవా కరోనా బారిన పడింది. తాజా పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో తాను టోర్నీ నుంచి వైదొలిగినట్లు ఆమె తెలిపింది. ‘‘గత రాత్రి నుంచి ఆరోగ్యం బాగాలేదు. ఉదయం లేవగానే జ్వరం ఉన్నట్లు అర్థమైంది. పరీక్ష చేయిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నా. త్వరలోనే మళ్లీ బరిలో దిగుతాను’’ అని 26 ఏళ్ల ఈ చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ తెలిపింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మొదలయ్యాక కరోనా తేలిన రెండో క్రీడాకారిణి క్రెజికోవా. మరో చెక్‌ అమ్మాయి బోజ్‌కోవా కూడా కొవిడ్‌ కారణంగానే పోటీల నుంచి తప్పుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్లో రెండో సీడ్‌గా ఉన్న క్రెజికోవా సింగిల్స్‌ తొలి రౌండ్లో 6-1, 2-6, 3-6తో దియాన్‌ పారీ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడింది. సినియాకోవాతో కలిసి డబుల్స్‌ బరిలో మాత్రమే మిగిలింది. కానీ కరోనా ఆమెను పూర్తిగా టోర్నీకి దూరం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని